Team India: రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 245 ఆలౌట్... ఇంగ్లండ్ టార్గెట్ 378 రన్స్

Team India set 378 runs target to England

  • రసవత్తరంగా బర్మింగ్ హామ్ టెస్టు
  • ఇవాళ ఆటకు నాలుగో రోజు
  • లంచ్ తర్వాత ఆలౌటైన భారత్
  • పుజారా, పంత్ అర్ధసెంచరీలు
  • స్టోక్స్ కు 4 వికెట్లు

టీమిండియా, ఇంగ్లండ్ మధ్య బర్మింగ్ హామ్ లో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టు రసవత్తరంగా మారింది. ఇవాళ ఆటకు నాలుగో రోజు కాగా, టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా ఇంగ్లండ్ ముందు 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక్కడి ఎడ్జ్ బాస్టన్ మైదానంలో పిచ్ పేసర్లకు విశేషంగా సహకరిస్తున్న నేపథ్యంలో, ఇంగ్లండ్ లక్ష్యఛేదన ఏమంత సులభం కాకపోవచ్చు. 

కాగా, టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో పుజారా 66, పంత్ 57, జడేజా 23, కోహ్లీ 20 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4, బ్రాడ్ 2, పాట్స్ 2, ఆండర్సన్ 1, జాక్ లీచ్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో మొదట టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 284 పరుగులు చేసింది.

More Telugu News