Miss India 2022 Sini Shetty: కన్నడ ముద్దుగుమ్మ సిని శెట్టికి మిస్ ఇండియా కిరీటం

Sini Shetty wins Miss India 2022

  • ఫస్ట్ రన్నరప్ గా రూబల్ షెకావత్
  • సెకండ్ రన్నరప్ గా షినాటా చౌహాన్
  • ముంబైలో పుట్టి, పెరిగిన సిని శెట్టి 

కన్నడ ముద్దుగుమ్మ సిని శెట్టి ఫెమినా మిస్ ఇండియా టైటిల్ ను గెలుచుకుంది. ముంబైలోని రిలయన్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో సిని శెట్టిని నిర్వాహకులు విజేతగా ప్రకటించారు. 21 ఏళ్ల సిని శెట్టి స్వరాష్ట్రం కర్ణాటక అయినప్పటికీ... ఆమె పుట్టి, పెరిగింది ముంబైలోనే. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ లో ఆమె బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఛార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్స్ చేస్తోంది. ఆమె భరతనాట్య కళాకారిణి కూడా కావడం గమనార్హం.  

ఈ అందాల పోటీలో రాజస్థాన్ కు చెందిన రూబల్ షెకావత్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన షినాటా చౌహాన్ సెకండ్ రన్నరప్ గా ఎంపికయింది. మిస్ ఇండియా జ్యూరీ ప్యానల్ లో సినీ నటులు డినో మోరియా, నేహా ధూపియా, మలైకా అరోరా, ప్రముఖ డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామక్ దావర్, టీమిండియా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ తదితరులు ఉన్నారు. 

More Telugu News