Narendra Modi: భీమవరంకు హెలికాప్టర్ లో బయల్దేరిన మోదీ, జగన్

Modi and Jagan leaves to Bhimavaram in helicopter
  • ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మోదీ
  • ఘన స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, బీజేపీ నేతలు
  • అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రధాని
భారత ప్రధాని మోదీ ఏపీలో అడుగుపెట్టారు. భీమవరంలో జరుగుతున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మోదీ విచ్చేశారు. హైదరాబాద్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో బయల్దేరిన ప్రధాని ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ప్రధానికి గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, బీజేపీ నేతలు సీఎం రమేశ్, సుజనా చౌదరి తదితరులు ఘన స్వాగతం పలికారు. 

అనంతరం గన్నవరం నుంచి భీమవరంకు మోదీ, హరిచందన్, జగన్ ముగ్గురూ ఒకే హెలికాప్టర్ లో బయల్దేరారు. మరోవైపు భీమమరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి, నివాళి అర్పించనున్నారు. అనంతరం భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానిని జగన్ సత్కరించనున్నారు.
Narendra Modi
BJP
Jagan
YSRCP
Biswabhusan Harichandan

More Telugu News