Pawan Kalyan: వీరమహిళలతో సెల్ఫీ దిగి ఉత్సాహపరిచిన పవన్ కల్యాణ్

Pawan Kalyan selfie with Janasene Veera Mahilas

  • మంగళగిరిలో వీరమహిళలకు రాజకీయ శిక్షణ
  • హాజరైన పవన్
  • ఆదివారం విజయవాడలో జన వాణి
  • ఎవరైనా సమస్యలు చెప్పుకోవచ్చన్న జనసేనాని

విజయవాడలో జన వాణి కార్యక్రమం కోసం జనసేనాని పవన్ కల్యాణ్ మంగళగిరి చేరుకున్నారు. కాగా, పార్టీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ శిక్షణ తరగతుల్లో ఉన్న జనసేన వీరమహిళలను పవన్ కలుసుకున్నారు. వీర మహిళలను ఉత్సాహపరిచేందుకు ఆయన వారితో సెల్ఫీ దిగారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగించారు. జనసేన ఆవిర్భావమే కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి వచ్చిందని తెలిపారు. జన వాణి కార్యక్రమంలో ఎవరైనా తమ సమస్యలను నిర్భయంగా వెల్లడించవచ్చని స్పష్టం చేశారు. జనవాణి కార్యక్రమాన్ని నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారని, అందరం ఏకగ్రీవంగా ఆమోదించామని చెప్పారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో రేపు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
.

Pawan Kalyan
Selfie
Veera Mahila
Janasena

More Telugu News