Talasani: ప్రధానికి సీఎం స్వాగతం పలకాలని ప్రొటోకాల్ లో ఎక్కడా లేదు: తలసాని
![CM receiving PM is not part of protocol says Talasani](https://imgd.ap7am.com/thumbnail/cr-20220702tn62c02e2b5a88a.jpg)
- మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే విషయం
- ఈరోజు వస్తున్నట్టు యశ్వంత్ సిన్హా ముందుగానే చెప్పారు
- ముందుస్తు ఎన్నికలకు మేము కూడా సిద్ధంగానే ఉన్నాం
హైదరాబాద్ కు వచ్చిన ప్రధాని మోదీకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధానికి స్వాగతం పలికేందుకు రాలేదు. ఈ అంశంపై తలసాని మాట్లాడుతూ... ప్రధానికి తాను స్వాగతం పలికానని... ముఖ్యమంత్రి వచ్చి స్వాగతం పలకాలని ప్రొటోకాల్ లో ఎక్కడా లేదని చెప్పారు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాల్సిన విషయమని అన్నారు.