Team India: ఐర్లాండ్‌తో రెండో టీ20... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాండ్యా

hardik pandya won the toss and elect to bat first

  • రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో టీమిండియా
  • ఐర్లాండ్ నెగ్గితే స‌మం కానున్న సిరీస్‌
  • తుది జ‌ట్టులో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు

ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా టీమిండియా మ‌రికాసేప‌ట్లో ఆ దేశంతో రెండో టీ20 ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి కాసేప‌టి క్రితం టాస్ వేయ‌గా...టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ నెగ్గాడు. తొలుత బ్యాటింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న పాండ్యా.. ఆతిథ్య జ‌ట్టుకు ఫీల్డింగ్ అప్ప‌గించాడు. రెండు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో నెగ్గిన టీమిండియా ఈ మ్యాచ్‌లో కూడా నెగ్గితే సిరీస్‌ను కైవ‌సం చేసుకోనుంది. ఐర్లాండ్ గెలిస్తే మాత్రం సిరీస్ స‌మం అవుతుంది.

ఇక రెండో టీ20లో ఆడ‌నున్న జ‌ట్టును బీసీసీఐ కాసేప‌టి క్రితం ప్ర‌క‌టించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో బ‌రిలోకి దిగ‌నున్న జ‌ట్టులో ఇషాన్ కిష‌న్‌, సంజూ శాంస‌న్‌, దీప‌క్ హుడా, సూర్య‌కుమార్ యాద‌వ్‌, దినేశ్ కార్తిక్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, ర‌వి బిష్ణోయ్‌, ఉమ్రాన్ మాలిక్‌లు ఉన్నారు. రాత్రి 9 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Team India
Ireland
BCCI
Hardik Pandya

More Telugu News