Maharashtra: సంజయ్ రౌత్‌కు మరోమారు ఈడీ సమన్లు
![ed fresh notices to shiv sena mp sanjay raut](https://imgd.ap7am.com/thumbnail/cr-20220628tn62baf41c47f5c.jpg)
- నగదు అక్రమ లావాదేవీలపై రౌత్‌పై ఈడీ కేసు
- మంగళవారం విచారణకు రావాలంటూ నిన్ననే ఈడీ నోటీసులు
- వేరే కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని రౌత్ సమాధానం
- జులై 1న విచారణకు రావాలంటూ తాజాగా ఈడీ సమన్లు
శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం మరోమారు సమన్లు జారీ చేసింది. జులై 1న తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఆయనను ఈడీ అధికారులు ఆదేశించారు. అక్రమ నగదు లావాదేవీల వ్యవహారంపై ఇప్పటికే సంజయ్ రౌత్‌పై ఈడీ కేసు నమోదు చేయగా... మంగళవారం తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు ఆయనకు సోమవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే తనకు ముందస్తుగా ఖరారైన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున మంగళవారం నాటి విచారణకు హాజరు కాలేనని రౌత్ సోమవారమే ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రౌత్ వినతికి సానుకూలంగానే స్పందించిన ఈడీ అధికారులు జులై 1న తమ ముందు విచారణకు హాజరు కావాలని తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు.