Shahrukh Khan: 'జవాన్' షూటింగులో పాల్గొన్న నయనతార!

Nayanathara in Jawan Movie

  • తమిళంలో బిజీగా నయనతార 
  • తెలుగులో ఆమె తాజా చిత్రం 'గాడ్ ఫాదర్'
  • సెట్స్ పై ఉన్న తన బాలీవుడ్ మూవీ 'జవాన్' 
  • దర్శకుడిగా అట్లీ కుమార్

ఇంతవరకూ నయనతార తమిళ సినిమాలనే ఎక్కువగా చేస్తూ వచ్చింది. తెలుగు .. మలయాళ భాషల్లో అడపాదడపా చేసినా, స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే చేస్తూ వచ్చింది. తెలుగు .. మలయాళ భాషల్లో కూడా నయనతారకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె తమ ప్రాజెక్టు ఒప్పుకుంటే చాలానే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. 

బాలీవుడ్ నుంచి ఆమెకి చాలానే అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు కోలీవుడ్ నుంచి అట్లీ కుమార్ బాలీవుడ్ వెళ్లి, షారుక్ ఖాన్ తో  'జవాన్' సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో చేయడానికి నయనతార అంగీకరించడం విశేషం. ముంబైలో షూటింగులో ఆమె ఈ రోజు పాల్గొంది.

ఇటీవలే నయనతార - విఘ్నేశ్ శివన్ ల వివాహం జరిగింది. వాళ్లు  హనీమూన్ కి వెళుతున్నారనీ, నయన్ కొన్ని రోజుల వరకూ షూటింగులకు హాజరు కాకపోవచ్చని అనుకున్నారు. కానీ ఆమె 'జవాన్' షూటింగులో పాల్గొంది. ఇక తెలుగులో ఆమె 'గాడ్ ఫాదర్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Shahrukh Khan
Nayanathara
Atlee Kumar
Jawan Movie
  • Loading...

More Telugu News