Night Club: దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో చెల్లాచెదురుగా మృతదేహాలు... ఎలా చనిపోయారన్నది మిస్టరీ!

17 peopl found dead in a South Africa night club
  • ఈస్ట్ లండన్ సిటీలో ఘటన
  • ఆదివారం వేకువ జామున ఘటన
  • మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేని వైనం
  • కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులు
దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో 17 మృతదేహాలు పడివుండడం తీవ్ర కలకలం రేపింది. ఈస్ట్ లండన్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మృతదేహాలన్నీ చెల్లా చెదురుగా క్లబ్ లోని వివిధ ప్రదేశాల్లో పడి ఉండగా, మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేదు. దాంతో వారు ఎలా చనిపోయారన్నది మిస్టరీగా మారింది. ఈస్ట్ లండన్ లోని సీనరీ పార్క్ లో ఈ నైట్ క్లబ్ ఉంది. ఆదివారం వేకువజామున మృతదేహాల సంగతి బయటికి పొక్కడంతో తీవ్ర కలకలం చెలరేగింది.

పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నించారు. దీనిపై ఓ పోలీసు అధికారి స్పందిస్తూ, తాము పుకార్లను నమ్మదలుచుకోలేదని, ఇంతమంది ఎలా మరణించారన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. కాగా, మృతదేహాల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయితే వారి మరణానికి నిర్దిష్ట కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Night Club
Deaths
East London
South Africa

More Telugu News