TDP: ...అడుగు నీ మ‌న‌స్సాక్షినే అడుగు!... చంద్ర‌బాబుపై తెలుగు ప్రొఫెష‌న‌ల్స్ పాట విడుద‌ల‌!

tdp professionals wing song on chandrababu out now

  • టీడీపీ ప్రొఫెష‌న‌ల్స్ ఆధ్వ‌ర్యంలో రూపొందిన పాట‌
  • పాట‌ను రాసిన సుధీర్ కుమార్ వ‌రాల
  • స్వ‌రాగ్ కీర్త‌న‌, ప్ర‌భాక‌ర్ ద‌మ్ముగారి, సాయి ప్ర‌జ్వ‌ల గానం
  • చంద్ర‌బాబు నాయ‌క‌త్వాన్ని కోరుతూ సాగిన పాట‌

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయ‌కత్వం మ‌రోమారు ఏపీకి అవ‌స‌ర‌మ‌ని చెబుతూ ఆ పార్టీ ప్రొఫెష‌న‌ల్స్ విభాగం ఓ పాట‌ను రూపొందించ‌గా... ఆ పాట‌ను చంద్ర‌బాబు స్వ‌యంగా శ‌నివారం విడుద‌ల చేశారు. తెలుగు ప్రొఫెష‌న‌ల్స్ రూపొందించిన ఈ పాట‌ను సుధీర్ కుమార్ వ‌రాల రాయ‌గా... ప్ర‌భాక‌ర్ ద‌మ్ముగారి సంగీతం అందించారు. సంగీత ద‌ర్శ‌కుడితో పాటు స్వ‌రాగ్ కీర్త‌న‌, సాయి ప్ర‌జ్వ‌ల ఈ పాట‌ను పాడారు. ఈ పాట‌కు క్రాంతి వ‌ల‌జ కాన్సెప్ట్‌ను అందించారు.

అడుగు, అడుగు, అడుగు నీ మ‌న‌స్సాక్షినే అడుగు... అంటూ సాగే ఈ పాట చంద్ర‌బాబు తొలి ప‌లుకుల‌తోనే మొద‌లైంది. 5.29 నిమిషాల నిడివి ఉన్న ఈ పాట‌లో ఉమ్మ‌డి రాష్ట్ర సీఎంగా చంద్ర‌బాబు హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఐటీ ప‌రంగా ఏ రీతిన అభివృద్ధి చేశార‌న్న విష‌యాన్ని వివ‌రించారు. అందుకు ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు, భ‌విష్య‌త్తును అంచ‌నా వేసిన తీరును అభివ‌ర్ణించారు. అంతేకాకుండా రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీని, ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఎంపిక చేసిన తీరు, రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌ల‌ను రాబ‌ట్టిన తీరును కూడా వివ‌రించారు. ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం సాగిస్తున్న పాల‌న‌, ఫ‌లితంగా జ‌రుగుతున్న న‌ష్టాన్ని వివ‌రిస్తూ మ‌రోమారు చంద్ర‌బాబు నాయ‌క‌త్వం కావాల‌న్న సందేశాన్ని వినిపించారు. 

More Telugu News