EAMCET: తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్ల విడుదల

Telangana EAMCET Hall Tickets released
  • ఆగస్టు 14 నుంచి 20 వరకు ఎంసెట్
  • మే 28తో దరఖాస్తుల స్వీకరణ పూర్తి
  • జులై 7 వరకు ఆలస్య రుసుంతో దరఖాస్తులు
  • జులై 11 వరకు హాల్ టికెట్ల డౌన్ లోడ్ కు అవకాశం
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షల హాల్ టికెట్లను నేడు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి దీనిపై ప్రకటన చేసింది. విద్యార్థులు తమ హాల్ టికెట్లను eamcet.tsche.ac.in వెబ్ సైట్ లింకు ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. జులై 11వ తేదీ వరకు వెబ్ సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. 

తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ఆగస్టు 14, 15, 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు. ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ మే 28తో పూర్తయింది. అయితే ఆలస్య రుసుంతో అభ్యర్థులు జులై 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
EAMCET
Hall Tickets
TSCHE
Telangana

More Telugu News