Sanjay Raut: దేవేంద్ర ఫడ్నవిస్ కు నేనిచ్చే సలహా ఇదే: సంజయ్ రౌత్

Sanjay Raut suggestion to Devendra Fadnavis

  • శివసేన పార్టీలో తిరుగుబాటు
  • రెబెల్ వెనుక ఫడ్నవిస్ ఉన్నారనే ఆరోపణలు
  • ఈ సంక్షోభంలో తలదూర్చవద్దని ఫడ్నవిస్ కు సంజయ్ రౌత్ హితవు

శివసేనలో ముసలం పుట్టిన సంగతి తెలిసిందే. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వెనకుండి నడపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శివసేన కీలక నేత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ ఫడ్నవిస్ కు ఒక సలహా ఇచ్చారు.

తమ పార్టీలో తలెత్తిన సంక్షోభంలో తల దూర్చవద్దని ఫడ్నవిస్ కు తాను సూచిస్తున్నానని చెప్పారు. గతంలో ఏం జరిగిందో ఫడ్నవిస్ గుర్తుకు తెచ్చుకోవాలని... ఉదయం ఏం జరిగిందో సాయంత్రానికల్లా అది లేకుండా పోయిందని చెప్పారు. 

గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం 80 గంటల సేపు మాత్రమే ఫడ్నవిస్ సీఎం కుర్చీలో ఉన్నారు. ఆ తర్వాత అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. దీన్ని ఉద్దేశించే సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

Sanjay Raut
Shiv Sena
Devendra Fadnavis
BJP
  • Loading...

More Telugu News