Chiranjeevi: వందలాది మంది డాన్సర్లతో చిరూ, సల్మాన్ పాటను ప్లాన్ చేశారట!

God Father movie upadate

  • 'భోళా శంకర్' షూటింగులో మెగాస్టార్
  • కొనసాగుతున్న యాక్షన్ సీన్స్ చిత్రీకరణ 
  • 'గాడ్ ఫాదర్'ను దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్ 
  • 'వాల్తేర్ వీరయ్య'ను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన టీమ్ 

ప్రస్తుతం చిరంజీవి 'భోళా శంకర్' సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. చిరంజీవి తదితరులపై భారీ యాక్షన్ సన్నివేశాలను  చిత్రీకరిస్తున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, గతంలో అజిత్ చేసిన 'వేదాళం' సినిమాకి రీమేక్.  తమన్నా  కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, చిరూ చెల్లెలిగా కీర్తి సురేశ్ కనిపించనుంది. 

ఇక బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న 'వాల్తేర్ వీరయ్య'ను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా రీసెంట్ గా ప్రకటించారు. దాంతో 'గాడ్ ఫాదర్' మాటేమిటి? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఇది మలయాళ లూసిఫర్ కి రీమేక్. ఈ సినిమా షూటింగు ఎంతవరకూ వచ్చినట్టు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


'గాడ్ ఫాదర్'కు సంబంధించి ఇంకా ఒక పాటను చిత్రీకరించవలసి ఉన్నట్టు తెలుస్తోంది. చిరంజీవి, సల్మాన్ తో పాటు 700 మంది డాన్సర్లు ఈ పాటలో పాల్గొననున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ పాటను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో ఈ సినిమా షూటింగు దాదాపు పూర్తయినట్టేననీ, 'దసరా' పండుగకి ప్రేక్షకుల ముందుకు రావొచ్చని అంటున్నారు.

Chiranjeevi
Nayanatara
Salman Khan
God Father Movie
  • Loading...

More Telugu News