Naga Chaitanya: తనయుడితో కలిసి ఇళయరాజా చేస్తున్న తొలి తెలుగు మూవీ ఇదే!

Chaithu Movie  Update

  • ఇప్పటికీ ఇళయరాజాకి తగ్గని క్రేజ్
  • చైతూ 22వ సినిమా కోసం రంగంలోకి 
  • దర్శకుడిగా వెంకట్ ప్రభు 
  • కథానాయికగా కనిపించనున్న కృతి శెట్టి  

తెలుగులో ఇళయరాజా ఇచ్చిన హిట్స్ గురించి మాట్లాడుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన పనిచేసింది రెండు  మూడు సినిమాలకి కాదు, ఆయన బాణీలు కట్టింది పదుల సంఖ్యలో కాదు. అలాంటి ఇళయరాజా ఇప్పటికీ తన జోరును కొనసాగిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో చాలావరకూ సినిమాల సంఖ్యను తగ్గించుకున్నారు. 

అందువలన ఇళయరాజా ఒక సినిమాను ఒప్పుకున్నారంటేనే అది ఒక అదృష్టంగా చెప్పుకుంటున్నారు. ఇక ఇళయరాజా తనయుడు 'యువన్' శంకర్ రాజా కూడా కొన్ని తెలుగు సినిమాలకి పనిచేశాడు. అలాంటి ఈ ఇద్దరూ కలిసి తెలుగులో ఒక సినిమాకి పనిచేస్తున్నారు. అదే వెంకట్ ప్రభు తాజా చిత్రం.

నాగచైతన్య కథానాయకుడిగా వెంకట్ ప్రభు ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఇళయరాజా - యువన్ శంకర్ రాజా కలిసి పని చేస్తుండటం విశేషం. నాగార్జునకి అనేక  హిట్స్ ఇచ్చిన ఇళయరాజా, చైతూ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెడతారేమో చూడాలి.

Naga Chaitanya
Krithi Shetty
Venkat Prabhu Movie
  • Loading...

More Telugu News