Rajanikanth: 'కబాలి' డైరెక్టర్ తో రజనీకాంత్!

Rajani in Ranjith Movie

  • వరుస సినిమాలతో బిజీగా ఉన్న రజనీ
  •  త్వరలో సెట్స్  పైకి వెళతున్న 169వ సినిమా
  • 170 వ సినిమాకి దర్శకుడిగా పా.రంజిత్
  • లైన్లోనే ఉన్న లోకేశ్ కనగరాజ్

రజనీకాంత్ కథానాయకుడిగా ఈ మధ్య వచ్చిన 'పెద్దన్న' ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తన 169వ సినిమాను ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ తో చేయడానికి రెడీ అవుతున్నారు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళుతోంది. ఈ నేపథ్యంలోనే తన 170వ సినిమాను కూడా రజనీ లైన్లో పెట్టినట్టుగా సమాచారం.

రజనీ 170వ సినిమాకి దర్శకుడు ఎవరో కాదు .. పా.రంజిత్. గతంలో ఆయన రజనీతో 'కబాలి' .. ' కాలా' అనే రెండు  సినిమాలను తెరకెక్కించాడు. ఈ సినిమాల వసూళ్ల సంగతి అటుంచితే, రజనీని కొత్తగా .. మరింత స్టయిలీష్ గా చూపించడంలో రంజిత్ కి మంచి మార్కులు పడ్డాయి. 

అందువల్లనే రీసెంట్ గా ఆయన వినిపించిన కథకి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఒక యువ దర్శకుడికి రజనీ ఇలా వరుస అవకాశాలు ఇవ్వడం విశేషం. ఇక లోకేశ్ కనగరాజ్ కూడా రజనీ కోసం ఒక  కథను రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్లిద్దరి కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. 

Rajanikanth
Ranjith
Kollywood
  • Loading...

More Telugu News