Telangana: ఈ నెల 28 నుంచి తెలంగాణాలో 'రైతు బంధు' నిధుల విడుద‌ల‌

rythu bandhu funds will release from 28th of this month in telangana

  • రైతు బంధు నిధుల విడుద‌ల‌కు కేసీఆర్ ఆదేశాలు
  • 28 నుంచి వ‌రుస క్ర‌మంలో రైతుల ఖాతాల్లో నిధుల జ‌మ‌
  • రైతుల ఖాతాల్లో జ‌మ కానున్న‌ వానాకాలం రైతు బంధు నిధులు

తెలంగాణ రైతుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇస్తున్న రైతు బంధు నిధుల విడుద‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. ఈ నెల 28 నుంచి వానాకాలం పంట పెట్టుబ‌డి రైతు బంధు నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగానికి బుధ‌వారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో అదే రోజు నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధుల‌ను జ‌మ చేస్తామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. గ‌తంలో మాదిరిగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనుంది.

More Telugu News