Maharashtra: నన్ను కిడ్నాప్ చేసి, చంపబోయారు .. శివసేన ఎమ్మెల్యే ఆరోపణ

i was kidnapped says shivsena mla amid Maharastra political crisis

  • శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ ముఖ్ సంచలన ఆరోపణలు
  • కిడ్నాప్ చేసి గుజరాత్ కు తీసుకెళ్లారని ఆరోపణ
  • తప్పించుకుని ముంబైకి తిరిగి వచ్చినట్టు వెల్లడి
  • తన మద్దతు ఉద్ధవ్ కేనని ప్రకటన

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సరికొత్త మలుపు తిరుగుతోంది. ఆ రాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండే సీఎం ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేస్తూ 20 మందికిపైగా శివసేన ఎమ్మెల్యేలతో గుజరాత్ లో క్యాంపు వేసిన విషయం తెలిసిందే. ఆ క్యాంపు నుంచి తిరిగొచ్చిన ఎమ్మెల్యే నితిన్ దేశ్ ముఖ్ సంచలన ఆరోపణలు చేశారు. తనను కిడ్నాప్ చేసి బలవంతంగా గుజరాత్ కు తీసుకెళ్లారని.. వారి నుంచి తప్పించుకుని వచ్చానని ప్రకటించారు.

మద్దతు ఉద్ధవ్ థాక్రేకే.. 
బుధవారం ముంబైలో నితిన్ దేశ్ ముఖ్ మీడియాతో మాట్లాడారు. ‘‘నన్ను ఏక్ నాథ్ షిందే తప్పుదోవ పట్టించారు. సీఎంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న విషయం నాకు చెప్పలేదు. సూరత్ తీసుకెళ్లాక నాకు అసలు విషయం తెలిసింది. వెంటనే హోటల్ నుంచి బయటికి వస్తుంటే.. పోలీసులు అడ్డుకున్నారు. నాకేమీ అనారోగ్యం లేకున్నా.. గుండెపోటు వచ్చిందంటూ బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఏదో ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించారు. నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని ముంబైకి వచ్చాను. నేను ఎప్పటికీ శివసేన సైనికుడినే. ఉద్ధవ్ కే నా మద్దతు” అని ప్రకటించారు.

ఎమ్మెల్యేలంతా రావాలంటూ శివసేన ఆదేశాలు    
రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు శివసేన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. ఆ సమావేశానికి రాకపోతే పార్టీని వీడుతున్నట్టుగా పరిగణించి.. సభ్యత్వం రద్దు చేస్తామని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News