Andhra Pradesh: ఏపీలో అదాని గ్రీన్ ఎన‌ర్జీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్‌... రూ.15,376 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నున్న ఆదాని గ్రూప్‌

ap sipb approves adani green energy project

  • గ్రీన్ ఎన‌ర్జీ ప్రాజెక్టుపై ఏపీ స‌ర్కారుకు అదాని గ్రూప్ ప్ర‌తిపాద‌న‌
  • ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల‌పై కూలంక‌షంగా ప‌రిశీలించిన ప్ర‌భుత్వం
  • జ‌గ‌న్ నేతృత్వంలో భేటీ అయిన ఎస్‌ఐపీబీ స‌మావేశం
  • అదాని ప్రాజెక్టుతో 4 వేల మందికి ఉద్యోగాలు ల‌భించే అవ‌కాశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో భారీ పెట్టుబ‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌చ్చ జెండా ఊపింది. అదాని గ్రూప్ చేప‌ట్ట‌నున్న 3,700 మెగావాట్ల పంప్‌డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు బుధ‌వారం సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో జ‌రిగిన ఎస్‌ఐపీబీ స‌మావేశం ఈ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది. 

ఈ ప్రాజెక్టు కోసం అదాని గ్రూప్ రూ.15,376 కోట్ల మేర పెట్టుబ‌డి పెట్ట‌నుంది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో 4 వేల మందికి ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇదివ‌ర‌కే అదాని గ్రూప్ ఏపీ ప్ర‌భుత్వం వ‌ద్ద ప్ర‌తిపాద‌న పెట్ట‌గా... దానిపై కూలంక‌షంగా ప‌రిశీలన జ‌రిపిన ప్ర‌భుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి ల‌భించిన నేపథ్యంలో త్వ‌ర‌లోనే అదాని గ్రీన్ ఎన‌ర్జీ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌నుంది.

Andhra Pradesh
Gautam Adani
Adani Group
Adani Green Energy Project
YSRCP
YS Jagan
SIPB

More Telugu News