Amitabh Bachchan: అమితాబ్ లాగే ఉన్న ఆఫ్ఘన్ శరణార్థుడు... సోషల్ మీడియాలో మళ్లీ వైరల్

Afghan refugee looks alike Amitabh

  • 2018లో తెరపైకి వచ్చిన ఫొటో
  • అమితాబ్ బచ్చనే అనుకున్న నెటిజన్లు
  • ఇప్పటికీ విస్మయం కలిగిస్తున్న ఫొటో

ఓ ఆఫ్ఘనిస్థాన్ శరణార్థుడు అచ్చం అమితాబ్ లాగే ఉన్నాడంటూ 2018లో ఓ ఫొటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఇప్పుడా ఫొటో మరోసారి తెరపైకి వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అప్పట్లో ఆ ఆఫ్ఘన్ శరణార్థి ఫొటోను ఓ ప్రముఖ ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఇప్పటికీ ఆ ఫొటో నెటిజన్లకు విస్మయం కలిగిస్తోంది. దాదాపుగా అమితాబ్ పోలీకలతోనే ఉన్న ఆ ఆఫ్ఘన్ జాతీయుడ్ని చూసి నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 

కొందరు ఆ ఫొటో చూసి అతడ్ని అమితాబే అనుకోగా, మరికొందరు అమితాబ్ తన తదుపరి చిత్రం కోసం తీయించుకున్న స్టిల్ అని భావిస్తున్నారు. ఇంకొందరు... గులాబో సితాబో చిత్రం నుంచి అమితాబ్ ఫొటో అని కొందరు, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ లో అమితాబ్ ఫొటో అని మరికొందరు పొరబడ్డారు. మొత్తమ్మీద ఆ ఫొటో సోషల్ మీడియాలో మరోసారి చర్చకు తావిచ్చింది.

Amitabh Bachchan
Afghan Refugee
Photo
Social Media
  • Loading...

More Telugu News