Yuvraj Singh: యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?

Yuvaraj Singh sons name

  • ఇటీవలే మగ బిడ్డకు జన్మనిచ్చిన యువరాజ్ భార్య హాజెల్
  • కొడుకుకు ఓరియన్ కీచ్ సింగ్ అని పేరు పెట్టినట్టు తెలిపిన యువరాజ్
  • ఓరియన్ కు ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నామన్న యువీ

టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే యువరాజ్ భార్య హాజెల్ కీచ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తమకు కొడుకు పుట్టినట్టు జనవరి 25న యువరాజ్ సింగ్ జంట ప్రకటించింది. 

తాజాగా వారు కుమారుడి పేరును యువరాజ్ సింగ్ ప్రకటించాడు. తమ కుమారుడికి 'ఓరియన్ కీచ్ సింగ్' అని పేరు పెట్టినట్టు ఫాదర్స్ డే సందర్భంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఓరియన్ కీచ్ సింగ్ కు ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నామని చెప్పాడు.

Yuvraj Singh
Son
Name

More Telugu News