Rain: ఆట మొదలైందనుకుంటే... అంతలోనే వాన!

Rain stops play in Bengaluru

  • బెంగళూరులో వరుణుడు దోబూచులాట
  • ఆలస్యంగా ప్రారంభమైన ఆట
  • 3.3 ఓవర్ల వద్ద వరుణుడు ప్రత్యక్షం
  • 2 వికెట్లకు 28 పరుగులు చేసిన టీమిండియా
  • ఓపెనర్లను అవుట్ చేసిన ఎంగిడి

బెంగళూరులో వరుణుడు దోబూచులాడుతున్నాడు. టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ ఆరంభానికి అంతరాయం కలిగించిన వాన... మ్యాచ్ మొదలయ్యాక మరోసారి పలకరించింది. దాంతో ఆట నిలిచిపోయింది. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 

అయితే వర్షం కారణంగా మ్యాచ్ 50 నిమిషాల ఆలస్యంగా మొదలైంది. బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 3.3 ఓవర్లలో 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా, ఈ దశలో వరుణుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. దాంతో ఆట నిలిపివేసి మైదానాన్ని కవర్లతో కప్పివేశారు. 

కాగా, టీమిండియా ఇన్నింగ్స్ దూకుడుగా ఆరంభమైంది. దక్షిణాఫ్రికా తాత్కాలిక సారథి కేశవ్ మహరాజ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఇషాన్ కిషన్ రెండు సిక్సులు బాదాడు. అయితే, 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎంగిడి విసిరిన స్లో బాల్ ను అంచనా వేయలేక బౌల్డయ్యాడు. అనంతరం ఎంగిడి అదే ఊపులో మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (10) ను కూడా అవుట్ చేయడంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. వర్షం వల్ల ఆట ఆగిపోయే సమయానికి క్రీజులో శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్ రిషబ్ పంత్ ఉన్నారు.

More Telugu News