Kamal Haasan: దర్శకుడు లోకేశ్ కోసం దేనికైనా రెడీ: కమలహాసన్

kamal  Interview

  • కమల్ బ్యానర్లో ఇటీవలే వచ్చిన 'విక్రమ్'
  • ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టిన సినిమా 
  • దర్శకుడికి కోటి రూపాయల కారు కొనిపెట్టిన కమల్ 
  • ఇకపై ఎలాంటి సాయం కావాలన్నా అడగొచ్చంటూ హామీ

కమలహాసన్ చాలా కాలం తరువాత తన సొంత నిర్మాణ సంస్థలో 'విక్రమ్' సినిమాను నిర్మించాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ సేతుపతి .. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషించారు. అనిరుధ్ ఈ సినిమాకి నేపథ్య సంగీతాన్ని అందించాడు. 

ఈ నెల 3వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. కమల్ నటనకి అదే స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. కమల్ కి ఈ సినిమా ఇప్పటికే భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఆయనను ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించింది. ఈ సినిమా తనను అప్పుల ఊబిలో నుంచి బయటపడేసిందని తాజా ఇంటర్వ్యూలో కమల్ చెప్పారు. 

కమల్ వంటి ఒక సీనియర్ స్టార్ హీరో .. కొత్తగా వచ్చిన ఒక దర్శకుడు తనని అప్పుల్లో నుంచి బయటపడేశాడని చెప్పుకోవడం విశేషం. అంతేకాదు .. ఇకపై లోకేశ్ కి తన నుంచి ఏ రూపంలో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను అందిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆయన లోకేశ్ కి కోటి రూపాయల కారును కొనిపెట్టిన సంగతి తెలిసిందే.

Kamal Haasan
Lokesh Kanagaraj
Vikram Movie
  • Loading...

More Telugu News