man: ఐటీ ఉద్యోగం కాదని.. గాడిద పాల వ్యాపారం!

Man quits plush job to open donkey milk farm in Mangaluru

  • రూ.40 లక్షల పెట్టుబడితో 20 గాడిదలు
  • మంగళూరుకు చెందిన శ్రీనివాసగౌడ వినూత్న వ్యాపారం
  • గాడిద పాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ప్రకటన

భారీ వేతనంతో కూడిన ఐటీ ఉద్యోగం కాదని గాడిద పాల వ్యాపారంతో ఓ వ్యక్తి.. ఇతర ఔత్సాహిక పెట్టుబడిదారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన శ్రీనివాస గౌడ సక్సెస్ స్టోరీని మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. 

2020 వరకు ఐటీ ఉద్యోగం చేసిన శ్రీనివాస గౌడ కరోనా, లాక్ డౌన్ లతో దానికి స్వస్తి చెప్పాడు. రూ.42 లక్షల పెట్టుబడితో 20 గాడిదలను సమకూర్చుకున్నాడు. దేశంలో ఇదొక ప్రత్యేకమైన, కర్ణాటకలోనే మొదటి గాడిదల పెంపకం, పాల ఉత్పత్తి కేంద్రంగా అతడు పేర్కొన్నాడు.
 
‘‘గాడిద పాలను విక్రయించాలన్నది మా ప్రణాళిక. గాడిద పాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలన్నది మా స్వప్నం. గాడిద పాలు ఔషధ గుణాలతో కూడినవి. దీన్ని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దేశంలో గాడిద సంతతి తగ్గిపోతుండడంతో నాకు ఈ ఆలోచన వచ్చింది. 30 ఎంఎల్ పాల ధర రూ.150’’ అని శ్రీనివాసగౌడ వివరించాడు.

మాల్స్, షాపులు, సూపర్ మార్కెట్లలో ఆవు, గేదె పాల మాదిరే గాడిద పాలను విక్రయానికి ఉంచనున్నట్టు ఆయన తెలిపాడు. ఇప్పటికే తనకు రూ.17 లక్షల విలువ ఆర్డర్లు వచ్చినట్టు వెల్లడించాడు.

More Telugu News