Nandigam Suresh: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ జీవిత చరిత్రతో తెరకెక్కనున్న సినిమా!

YSRCP MP Nandigam Suresh biopic

  • దళితులకు చంద్రబాబు చేసిన అన్యాయంపై సినిమా ఉంటుందన్న సురేశ్
  • సామాన్యుడినైన తనను జగన్ ఎంపీ చేశారని వ్యాఖ్య
  • దళితులకు జగన్ అండగా ఉంటారన్న సురేశ్

టాలీవుడ్ లో మరో బయోపిక్ తెరకెక్కబోతోంది. బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ జీవిత చరిత్రతో ఈ బయోపిక్ ను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నందిగం సురేశ్ మాట్లాడుతూ, ప్రజల కోరిక మేరకు తన బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు తెలిపారు. నెల రోజుల్లో సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ ప్రశంసలు కురిపించారు. ఒక సామాన్యుడినైన తనను జగన్ ఎంపీని చేశారని కొనియాడారు. ఇది దళితులకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. 

టీడీపీ చేసిన దారుణాలు, వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఈ సినిమా కథ ఉంటుందని నందిగం సురేశ్ తెలిపారు. అమరావతి విషయంలో దళితులకు చంద్రబాబు చేసిన అన్యాయంపై ఈ సినిమా ఉంటుందని చెప్పారు. దళితులకు జగన్ అండగా నిలుస్తున్నారని అన్నారు.

Nandigam Suresh
YSRCP
Biopic
Tollywood
  • Loading...

More Telugu News