Andhra Pradesh: జులై 4న ఏపీకి ప్ర‌ధాని మోదీ రాక.. మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌కు ప్రారంభోత్సవం

pm modi inaugurates mangalagiri aiims on july 4th
  • మంగ‌ళ‌గిరిలో నిర్మాణం పూర్తయిన ఎయిమ్స్‌
  • జులై 4న మోదీ చేతుల మీదుగా ప్రారంభం
  • మోదీ వెంట ఏపీకి కేంద్ర మంత్రి శోభా క‌రంద్లాజే
భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జులై 4న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాజ‌ధాని అమ‌రావతి ప‌రిధిలోని మంగ‌ళ‌గిరిలో నూత‌నంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఎయిమ్స్‌ను ప్రారంభించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌నలో మోదీ వెంట కేంద్ర మంత్రి శోభా క‌రంద్లాజే కూడా ఏపీకి రానున్నారు. ఈ మేర‌కు బుధ‌వారం కేంద్రం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. 

ప్రధాని ఏపీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలోనే ఇటీవ‌లే రాష్ట్రంలో కేంద్ర ఆరోగ్య శాఖ స‌హాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌ను కేంద్ర మంత్రి ప‌రిశీలించారు. అంతేకాకుండా ఆసుప‌త్రి నిర్మాణం మొత్తాన్ని ఆమె నిశితంగా ప‌రిశీలించారు. ఆమె ఇచ్చిన స‌మాచారంతోనే మోదీ ప‌ర్య‌ట‌న ఖ‌రారైన‌ట్లుగా తెలుస్తోంది.
Andhra Pradesh
Prime Minister
Narendra Modi
Mangalagiri AIIMS

More Telugu News