Gopichand: యాంకర్ ముందే మారుతికి కాల్ చేసి అప్పు అడిగిన గోపీచంద్!

Gopichand  Interview

  • 'పక్కా కమర్షియల్' ప్రమోషన్స్ లో గోపీచంద్ 
  • ఆయనకి ఒక టాస్క్ ఇచ్చిన యాంకర్
  • మారుతికి కాల్ చేసి అప్పు అడిగిన గోపీచంద్ 
  • పదివేలే అడగడంతో ఆశ్చర్యపోయిన మారుతి

గోపీచంద్ తాజా చిత్రంగా రూపొందిన 'పక్కా కమర్షియల్' సినిమా జులై 1వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజా ఇంటర్వ్యూలో భాగంగా గోపీచంద్ మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో కమర్షియల్ గా ఉండటంలో తప్పులేదని అన్నారు. తన దగ్గర అప్పుతీసుకుని ఎగ్గొట్టినవాళ్లు చాలామందే  ఉన్నారని చెప్పారు. 

'మీరు కూడా ఎవరికైనా కాల్ చేసి రీజన్ చెప్పకుండా వెంటనే డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయమని అడగండి .. చూద్దాం' అంటూ యాంకర్ అనడంతో, వెంటనే దర్శకుడు మారుతికి గోపీచంద్ కాల్ చేసి 'అన్నా ..  ఓ  పదివేలు కావాలి .. గూగుల్ పే చేస్తావా' అని అడిగారు. గోపీచంద్ పదివేలు అడగడంతో మారుతి ఆశ్చర్యపోయారు. 'అదేంటన్నా అదేదో పది లక్షలలాగా అడిగావు .. పంపిస్తున్నాను ఉండండి" అంటూ వెంటనే ట్రాన్స్ ఫర్ చేశారు. 

అప్పుడు గోపీచంద్ నవ్వుతూ .. "మారుతి చాలా మంచివాడు ..  పదివేలు కాదు .. పది లక్షలు అడిగినా అలాగే స్పందిస్తాడు. ఈ సినిమాలో నేను మరింత హ్యాండ్సమ్ గా కనిపించడానికి మారుతి చాలా కష్టపడడ్డాడు. కెమెరా మెన్ తో కలిసి ఆయన తీసుకున్న శ్రద్ధ వల్లనే నేను అంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.

Gopichand
Rashi Khanna
pakka Commercial Movie
  • Loading...

More Telugu News