Gas Cylinder: వంటగ్యాస్ సిలిండర్ డిపాజిట్ మొత్తం భారీగా పెంపు
![Oil Companies hiked gas cylinder deposit price](https://imgd.ap7am.com/thumbnail/cr-20220615tn62a9456041950.jpg)
- రూ. 2,200కు పెరిగిన 14.2 కిలోల సిలిండర్ డిపాజిట్ మొత్తం
- ఐదు కిలోల సిలిండర్‌పై రూ. 350 పెంపు
- రేపటి నుంచే అమల్లోకి.. కొత్త కనెక్షన్లకే వర్తింపు
కొత్తగా వంటగ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి ఇది చేదువార్తే. ప్రస్తుతం ఉన్న డిపాజిట్ మొత్తాన్ని భారీగా పెంచుతూ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ డిపాజిట్ ప్రస్తుతం రూ. 1,450 ఉండగా దానిని రూ. 2,200కు పెంచారు. ఐదు కిలోల సిలిండర్ డిపాజిట్‌ను రూ. 800 నుంచి రూ. 1,150కి పెంచుతున్నట్టు ఇంధన సంస్థలు ప్రకటించాయి.
ఇకపై, రెగ్యులేటర్‌కు కూడా రూ. 250 వసూలు చేస్తారు. పెంచిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ఇంధన సంస్థలు తెలిపాయి. ఉజ్వల యోజన వినియోగదారులకు ఈ ధరలు వర్తించవని, కొత్త కనెక్షన్ తీసుకునే వారే కొత్త ధరలను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.