Team India: శుభారంభం అందించిన టీమిండియా ఓపెనర్లు... నిరాశపరిచిన మిడిలార్డర్

Team India openers gives good start

  • విశాఖలో దక్షిణాఫ్రికాతో మూడో మ్యాచ్ 
  • అర్ధసెంచరీలతో రాణించిన రుతురాజ్, ఇషాన్ కిషన్
  • విఫలమైన అయ్యర్, పంత్, దినేశ్ కార్తీక్

దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ అర్ధసెంచరీలతో అదరగొట్టారు. రుతురాజ్ 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 57 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 54 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 97 పరుగులు జోడించి శుభారంభం అందించారు. 

అయితే, ఈ జోడీ అవుటైన తర్వాత టీమిండియా స్కోరు మందగించింది. శ్రేయాస్ అయ్యర్ (14), కెప్టెన్ రిషబ్ పంత్ (6), దినేశ్ కార్తీక్ (6) నిరాశపరిచారు. హార్దిక్ పటేల్ 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్ 2, రబాడా 1, షంసీ 1, కేశవ్ మహారాజ్ 1 వికెట్ తీశారు.

Team India
Openers
South Africa
3rd T20
Vizag
  • Loading...

More Telugu News