Enugu: 'ఏనుగు' విడుదల వాయిదా

Enugu movie release postponed

  • అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా తెరకెక్కిన 'ఏనుగు'
  • షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న విడుదల కావాల్సిన చిత్రం
  • సాంకేతిక కారణాల వల్ల విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన చిత్రం యూనిట్

అరుణ్ విజయ్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించిన 'ఏనుగు' చిత్రం విడుదల వాయిదా పడింది. ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు చిత్రం యూనిట్ ప్రకటించింది. తెలుగు, తమిళం రెండు వర్షన్స్ లో విడుదలను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. తదుపరి విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. 

ఈ చిత్రంలో రాధిక శరత్ కుమార్, సముద్రఖని, యోగి బాబు, కేజీఎఫ్ రామచంద్రరాజు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి 'సింగం' సిరీస్ సినిమాలను తెరకెక్కించిన హరి దర్శకత్వం వహించారు. సీహెచ్ సతీశ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో ఘనంగా జరిగింది.

Enugu
Arun Vijay
Priya Bhavani Shankar
Tollywood
Kollywood
Release
  • Loading...

More Telugu News