best selling: స్మార్ట్ వాచ్ ల మార్కెట్లో తిరుగే లేని యాపిల్

- బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ వాచ్ టాప్-5లో మూడు యాపిల్ వే
- మొదటి స్థానంలో యాపిల్ వాచ్ సిరీస్ 7
- రెండో స్థానంలో యాపిల్ ఎస్ఈ వాచ్
- ఐదో స్థానంలో యాపిల్ వాచ్ సిరీస్ 3
స్మార్ట్ వాచ్ ల ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ఈ మార్కెట్లో యాపిల్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఐడీసీ అంచనాల అధ్యయనం ప్రకారం.. యాపిల్ వాచ్ సిరీస్ 7 ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్న స్మార్ట్ వాచ్. 2021లో ఇది విడుదలైంది. యాపిల్ ఫ్లాగ్ షిప్ వాచ్ ఇది.

ప్రపంచంలో టాప్ 5 స్మార్ట్ వాచ్ లలో మూడు యాపిల్ సంస్థవే కావడం గమనార్హం. స్మార్ట్ వాచ్ మార్కెట్ ను యాపిల్ శాసిస్తుందని చెప్పడానికి ఇంతకంటే మరో నిదర్శనం అక్కర్లేదు.

ఇందులో యాపిల్ వాచ్ సిరీస్ 7 ధర రూ.40 వేల నుంచి మొదలవుతుంటే.. యాపిల్ వాచ్ ఎస్ఈ ధర రూ.28,000గా ఉంది. యాపిల్ వాచ్ సిరీస్ 3 రూ.20 వేలల్లో లభిస్తోంది.