Sensex: వరుసగా మూడో రోజు నష్టపోయిన మార్కెట్లు... 568 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

Sensex looses 568 points

  • 153 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • మార్కెట్లపై ప్రభావం చూపిన అంతర్జాతీయ ప్రతికూలతలు
  • నాలుగున్నర శాతం వరకు నష్టపోయిన టైటాన్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు క్షణాల వ్యవధిలోనే కుప్పకూలాయి. ఆ తర్వాత మార్కెట్లు కోలుకోలేదు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపాయి. 

బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 118 డాలర్లను దాటడం... ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ రెండు శాతం మేర వడ్డీ రేట్లను పెంచడం, కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ కూడా పెంచబోతోందనే అంచనాలతో మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 568 పాయింట్లు నష్టపోయి 55,107కి పడిపోయింది. నిఫ్టీ 153 పాయింట్లు కోల్పోయి 16,416 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (1.35%), మారుతి (1.30%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.50%), భారతి ఎయిర్ టెల్ (0.37%), రిలయన్స్ (0.20%). 

టాప్ లూజర్స్:
టైటాన్ (-4.48%), డాక్టర్ రెడ్డీస్ (-3.87%), ఎల్ అండ్ టీ (-3.00%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.98%), ఏసియన్ పెయింట్స్ (-2.61%).

  • Loading...

More Telugu News