Rain: జంటనగరాల్లో వర్షం... ఎండవేడిమి నుంచి ఉపశమనం

Rain in twin cities

  • కొన్నిరోజులుగా హైదరాబాదులో మండే ఎండలు
  • విపరీతమైన వేడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
  • ఈ సాయంత్రం భారీ వర్షం
  • చల్లబడిన వాతావరణం

హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఈ సాయంత్రం వర్షం కురిసింది. భానుడి విశ్వరూపానికి హడలిపోతున్న ప్రజలకు ఈ వర్షం ఊరట కలిగించిందని చెప్పాలి. గత కొన్నిరోజులుగా విపరీతమైన వేడితో అవస్థలుపడుతున్న ప్రజానీకం... చల్లబడిన వాతావరణంతో ఉపశమనం పొందింది. 

బేగంపేట, మారేడ్ పల్లి, బోయిన్ పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల, బహదూర్ పల్లి, సూరారం, మల్కాజిగిరి, ఆల్వాల్, నేరేడ్ మెట్, తిరుమలగిరి, బహదూర్ పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగర శివార్లలో అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్నిచోట్ల ఈదురుగాలులు కూడా వీచాయి.

Rain
Hyderabad
Secunderabad
Heatwave
Summer
  • Loading...

More Telugu News