111 ft cake: గిన్నిస్ పుస్తకంలోకి 111 అడుగుల ‘యోగి’ కేక్..!
![111 ft cake for Yogis 50th birthday CMs supporter aims world record](https://imgd.ap7am.com/thumbnail/cr-20220605tn629c460aba3d3.jpg)
- యూపీ సీఎం పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్
- గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకోనున్న పొడవైన కేక్
- అయోధ్యలో 5 లక్షల మందితో హనుమాన్ చాలీసా పారాయణ
ఈ కేక్ వందలాది మంది నోటీని తీపి చేయగలదు. ఎందుకంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలోకి చోటు సంపాదించుకోనున్న ఈ కేక్ కు ఒక ప్రత్యేకత ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 50వ పుట్టిన రోజు సందర్భంగా రూపొందించినది. ముఖ్యమంత్రి యోగి మద్దతుదారులు ఈ కేక్ ను తయారు చేయించారు. దీని పొడవు 111 అడుగులు. ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యంత పొడవైన కేక్ రికార్డ్ 108.27 అడుగులు ఉండగా, అది చెరిగిపోనుంది.