Yogi Adityanath: యోగి డైనమిక్ సీఎం అంటూ మెచ్చుకున్న: ప్రధాని మోదీ
![A dynamic CM PM Modi wishes UP CM Yogi Adityanath on 50th birthday](https://imgd.ap7am.com/thumbnail/cr-20220605tn629c2dfb6ba2c.jpg)
- నేడు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్న యోగి
- సీఎం నాయకత్వంలో కొత్త శిఖరాలకు యూపీ
- దీర్ఘకాలం పాటు ఆరోగ్యంతో ప్రజాసేవకు అంకితం కావాలని ట్వీట్
- కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీఎస్పీ మాయావతి సైతం శుభాకాంక్షలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. యోగి నేడు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ ను ‘డైనమిక్ సీఎం’అని ప్రధాని కీర్తించారు. యోగి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో నూతన శిఖరాలను చేరుకున్నట్టు ప్రకటించారు. ‘‘రాష్ట్ర ప్రజలకు ప్రజా అనుకూల పాలనకు భరోసా ఇచ్చారు. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించి ప్రజల కోసం సేవ చేయాలి’’అంటూ ప్రధాని మోదీ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.