Explosion: ఉత్తరప్రదేశ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు... 9 మంది మృతి

Nine workers died in huge explosion at a chemical factory in Uttar Pradesh

  • హాపూర్ జిల్లాలో ఘటన
  • బాయిలర్ పేలడంతో ప్రాణనష్టం
  • 15 మందికి గాయాలు
  • పక్కనే ఉన్న కంపెనీల పైకప్పులు ధ్వంసం

ఉత్తరప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. హాపూర్ జిల్లా ధౌలానా యూపీఎస్ఐడీసీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో నేడు భారీ పేలుడు సంభవించింది. బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో 9 మంది మరణించగా, 15 మంది గాయపడ్డారు. కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఇతర కంపెనీల పైకప్పులు కూడా దెబ్బతిన్నాయి. పేలుడు కారణంగా చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక దళం, పోలీసులు మూడు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. 

కాగా, ఈ పేలుడు ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధిత కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.

More Telugu News