Sashi Kiram: కన్నీరు పెట్టుకున్న 'మేజర్' సినిమా దర్శకుడు

Major film director Sashi Kiran gets emotional

  • ప్రేక్షకుల మన్ననలు అందుకున్న 'మేజర్' సినిమా
  • షూటింగ్ సమయంలో తన తండ్రి చనిపోయారన్న దర్శకుడు శశికిరణ్
  • రేవతి, ప్రకాశ్ రాజ్ పాత్రలను చూస్తుంటే తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారని కంటతడి

అడివి శేష్ హీరోగా నటించిన 'మేజర్' సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ముంబై ఉగ్రదాడిలో వీరోచితంగా పోరాడి దేశం కోసం వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సినిమా విజయం సాధించడంతో సినిమా యూనిట్ ఆనందంలో ఉన్నారు. సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు శశికిరణ్ మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. సినిమా షూటింగ్ సమయంలో తన తండ్రి చనిపోయారని చెప్పారు. ఈ సినిమాలో రేవతి, ప్రకాశ్ రాజ్ పాత్రలను చూస్తుంటే ప్రేక్షకులు అందరి మాదిరే తనకు కూడా తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారని చెబుతూ, భావోద్వేగానికి గురయ్యారు.

Sashi Kiram
Major film
Director
Adivi Shesh
Tollywood
  • Loading...

More Telugu News