YS Sharmila: వాస్తవాలను పోలీసులు ఎందుకు దాస్తున్నారు?: షర్మిల

Sharmila response on Hyderabad rape incident
  • హైదరాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచారం
  • కలకలం రేపుతున్న గ్యాంగ్ రేప్ ఘటన
  • అధికార పార్టీ నేతలు దారుణానికి పాల్పడ్డారన్న షర్మిల
హైదరాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది. అధికార పార్టీకి చెందిన నేతల కుమారులు కూడా ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన కొందరు అధికార పార్టీ నేతల కొడుకులపై పోలీసులు ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. 

ఈ కేసులో హోంమంత్రి మనవడు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కొడుకు ప్రమేయం ఉందనే వార్తలు వస్తున్నాయని చెప్పారు. వాస్తవాలను పోలీసులు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. పెద్ద నేతల బిడ్డలయినంత మాత్రాన చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ఘటన జరిగి వారం రోజులు అయిందని... ఇంత వరకు నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని షర్మిల నిలదీశారు.
YS Sharmila
YSRTP
Hyderabad
Gang Rape

More Telugu News