Ratakarathna: నన్ను ఎవరూ దూరం పెట్టలేదు .. ఎన్టీఆర్ గురించి నేను అలా అనుకోలేదు: తారకరత్న

Tarakarathna Intarview

  • మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన తారకరత్న 
  • ఎన్టీఆర్ కి పోటీగా తాను రాలేదని వివరణ 
  • ఆయన సక్సెస్ నందమూరి ఫ్యామిలీ సక్సెస్ గానే లెక్కని వ్యాఖ్య  
  • పుకార్లను పట్టించుకోమన్న తారకరత్న   

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో తారకరత్న ఒకరు. హీరోగా కలిసిరాకపోవడంతో, విలన్ వేషాల వైపు టర్న్ తీసుకున్నాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన, మళ్లీ తన కెరియర్ పై దృష్టి పెట్టాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన తనకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 

"నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లంతా నన్ను దూరం పెట్టినట్టుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదు. మా బాబాయిలు .. అత్తయ్యలు అందరూ కూడా నన్నెంతో బాగా చూసుకుంటూ ఉంటారు. అందరూ అనుకుంటున్నట్టుగా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.                                         

ఇక ఎన్టీఆర్ కి పోటీగా నన్ను దింపినట్టుగా కూడా అప్పట్లో చెప్పుకున్నారు. కానీ మా ఫ్యామిలీలో ఎవరూ ఎప్పుడూ అలా అనుకోలేదు. ఎన్టీఆర్ ముందుకు వెళుతున్నాడంటే, నందమూరి ఫ్యామిలీ ముందుకు వెళుతుందనే అర్థం. మేమందరం ప్రేమాభిమానాలతోనే ఉన్నాము. పుకార్లు సృష్టించేవారికి సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదు" అని చెప్పుకొచ్చాడు.

Ratakarathna
Junior NTR
Tollywood
  • Loading...

More Telugu News