IMD: ఐదు రాష్ట్రాలకు వర్ష సూచన చేసిన భారత వాతావరణ శాఖ

IMD informs heavy rains for 5 states

  • వేగంగా కదులుతున్న రుతుపవనాలు
  • అరేబియా సముద్రం నుంచి వీస్తున్న పశ్చిమగాలులు
  • కోస్తాంధ్రలో ఐదు రోజుల పాటు విస్తారంగా కురవనున్న వర్షాలు

దేశంలో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఇదే సమయంలో అరేబియా సముద్రం నుంచి పశ్చిమగాలుల ప్రభావం కూడా దేశంలోని పలు ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర, దక్షిణ కర్ణాటక, కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, ఝార్ఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

కోస్తాంధ్ర, దక్షిణ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ లలో ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షంతో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.  పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లలో హీట్ వేవ్ కొనసాగుతుందని చెప్పింది.

IMD
Rains
Andhra Pradesh
  • Loading...

More Telugu News