Rape: హైదరాబాద్ పబ్ నుంచి బాలిక అపహరణ, అత్యాచారం.. నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు.. అంతా మైనర్లే!

MLA Son In Jubilee Hills Pub Minor Rape Case
  • ఐదుగురు నిందితులపై పోక్సో కింద కేసు
  • బాలిక ఒక్కరినే గుర్తుపడుతోందన్న పోలీసులు
  • నిందితులందరినీ అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్
  • కేసీఆర్, అసదుద్దీన్ ఆదేశాల కోసం చూస్తున్నారా? అంటూ ఫైర్
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పబ్ నుంచి బాలికను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. 17 ఏళ్ల అమ్మాయిని పార్టీ పేరుతో పబ్ కు పిలిచిన ఐదుగురు యువకులు.. ఆమెను బెంజ్ కారులో అపహరించి అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. నిందితులంతా మైనర్లేనని పోలీసులు చెబుతున్నారు. అందులో ఒకరు ఎమ్మెల్యే కొడుకని పేర్కొన్నారు. 

శనివారం రాత్రి అత్యాచార ఘటన జరగ్గా.. జూన్ 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక్క నిందితుడినే బాలిక గుర్తు పడుతోందని, మిగతా వాళ్లను గుర్తించడం లేదని పోలీసులు తెలిపారు. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. 

కాగా, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ తెలంగాణ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిందితుల్లో ఒకరు ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుని, మరొకరు మైనారిటీ కమిషన్ చైర్మన్ కొడుకని చెప్పారు. కేసులో ఇప్పటిదాకా ఒక్క నిందితుడినీ అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. నిందితుల మీద కేసు పెట్టేందుకు పోలీసులు సీఎం కేసీఆర్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల కోసం వేచి చూస్తున్నారా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యాచారాలు, పరువు హత్యలు పెరిగిపోతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని, వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Rape
Crime News
Hyderabad
Police
TS Police
Hyderabad Police

More Telugu News