West Bengal: కోల్‌కతాలో పది నిమిషాల్లోనే మద్యం డోర్ డెలివరీ.. సేవలు ప్రారంభించిన హైదరాబాద్ స్టార్టప్

Now get liquor delivered in 10 minutes in kolkata
  • ‘బూజీ’ పేరుతో సేవలు అందిస్తున్న ఇన్నోవెంట్  టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
  • మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్న పలు సంస్థలు
  • పది నిమిషాల్లోనే డెలివరీ చేసే సంస్థ తమదేనన్న ‘బూజీ’
కోల్‌కతాలో ఇప్పుడు ఇంటి వద్దకే మద్యం సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ పది నిమిషాల్లోనే మద్యం డెలివరీ చేస్తోంది. నిజానికి మద్యాన్ని డోర్ డెలివరీ చేసే సంస్థలు చాలానే ఉన్నప్పటికీ కేవలం 10 నిమిషాల్లోనే మద్యాన్ని సరఫరా చేసే సంస్థ ఇదొక్కటే. 

హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘బూజీ’ బ్రాండ్ పేరుతో కోల్‌కతాలో ఈ సేవలు అందిస్తోంది. ఆన్‌లైన్ సేవలకు ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకుని ఈ సేవలు ప్రారంభించింది. మద్యాన్ని ఆర్డరు చేసిన పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నామని, ఇలా చేస్తున్న తొలి సంస్థ తమదేనని కంపెనీ పేర్కొంది.
West Bengal
Liqour
Liquor Online Service
Booozie

More Telugu News