Prabhas: 'సలార్' స్పీడ్ పెంచనున్న ప్రశాంత్ నీల్!

Salaar movie update

  • షూటింగు దశలో 'సలార్'
  • భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ 
  • ఇకపై స్పీడ్ గా జరగనున్న షూటింగ్ 
  • అందుకు తగినట్టుగానే డేట్స్ ఇచ్చిన  ప్రభాస్

ప్రభాస్  హీరోగా ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమాను రూపొందిస్తున్నాడు. భారీ బ్యానర్ లో ఈ సినిమా నిర్మితమవుతోంది. 'కేజీఎఫ్' .. 'కేజీఎఫ్ 2' సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులను నమోదు చేసిన ప్రశాంత్ నీల్, 'సలార్' పై అమాంతంగా అంచనాలు పెంచేశాడు. ఆ అంచనాలను నిలబెట్టడానికి ఆయన తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.

'సలార్'కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ను ఒక రేంజ్ లో ఆయన డిజైన్ చేయించినట్టుగా చెబుతున్నారు. సినిమా మొదలైన దగ్గర నుంచి ఒక సీన్ కి మించి మరో సీన్ ఉండేలా ఆయన ప్లాన్ చేశాడని అంటున్నారు. ఈ సినిమా చాలా ఫాస్టుగా మొదలైనప్పటికీ అంతే ఫాస్టుగా షూటింగు జరుపుకోలేకపోయింది. 

ప్రభాస్ ఇతర సినిమాల షూటింగులతో బిజీగా ఉండటం వలన ఆలస్యమైపోయింది. ఇంతవరకూ 35 శాతం మాత్రమే చిత్రీకరణ జరుపుకుంది. అందువలన ఇకపై ఈ సినిమా షూటింగు ఆగకుండా వరుస షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగిన విధంగా ప్రభాస్ డేట్స్ తీసుకోవడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్న సంగతి తెలిసిందే.

Prabhas
Sruthi Haasan
Prashanth Neel
Salaar Movie
  • Loading...

More Telugu News