Vijay Devarakonda: అప్పట్లో నా జేబులో పది రూపాయలు కూడా ఉండేవి కాదు: తరుణ్ భాస్కర్

Alitho Saradaga Interview

  • 'ఆలీతో సరదాగా'లో పాల్గొన్న తరుణ్ భాస్కర్
  • షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేవాడినంటూ వివరణ 
  • తన బ్యాచ్ లో విజయ్ దేవరకొండ కూడా వుండేవాడన్న తరుణ్  
  • 'పెళ్లి చూపులు'తో కలిసొచ్చిందంటూ వ్యాఖ్య  

'పెళ్లి చూపులు' సినిమాతో దర్శకుడిగా తరుణ్ భాస్కర్ తన సత్తా చాటుకున్నాడు. ఆ తరువాత దర్శకుడిగా తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే, నటుడిగాను బిజీ అవుతున్నాడు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నాడు. 

మా ఫ్యామిలీ నుంచి ఎవరూ సినిమాల్లో లేరు. నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేవాడిని. ఏవో కథలు రాసుకుంటూ అవకాశాల కోసం తిరుగుతూ  ఉండేవాడిని. ఆ సమయంలో జేబులో పది రూపాయలు ఉండేవి కాదు. అయినా బుర్రలో 100 కోట్ల ఆలోచనలు ఉన్నాయి కదా అనుకుంటూ ముందుకు వెళ్లే వాడిని. 

అలాంటి సమయంలోనే విజయ్ దేవరకొండ పరిచయమయ్యాడు. అంతా కలిసి ఒక బ్యాచ్ గా ఉంటూ సినిమాలను గురించిన ఆలోచనలు చేసేవాళ్లం. అలా చివరికి 'పెళ్లి చూపులు' సెట్స్ పైకి వెళ్లింది. ఆ సినిమా యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. ఇటు నాకు .. అటు విజయ్ కి ఇద్దరి కెరియర్ కి ఆ సినిమా చాలా హెల్ప్ అయింది" అని చెప్పుకొచ్చాడు.

Vijay Devarakonda
Tarun Bhaskar
Pelli Chupulu Movie
  • Loading...

More Telugu News