Krishna: సూపర్ స్టార్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్

AP CM Jagan wishes Superstar Krishna on his birthday
  • నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు
  • 80వ పడిలో ప్రవేశించిన కృష్ణ
  • మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలన్న సీఎం జగన్
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నేడు 80వ పడిలో అడుగుపెట్టారు. కృష్ణ జన్మదినం (మే 31) సందర్భంగా అన్ని వైపుల నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం జగన్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 'సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు. 'అభిమానుల ప్రేమాభిమానాలు, దేవుడి ఆశీస్సులతో మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'నని పేర్కొన్నారు. 

అటు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "నేడు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు మరింత బలాన్ని ఇవ్వాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మరికొన్ని కాలాల పాటు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.
Krishna
Superstar
Birthday
CM Jagan
Vijayasai Reddy
Wishes
YSRCP
Tollywood

More Telugu News