Jayaprada: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన జయప్రద!

Want to work in Telugu states says Jayaprada

  • ఏపీకి కానీ, తెలంగాణకు కానీ రావాలనుకుంటున్నానన్న జయప్రద 
  • తెలుగు రాష్ట్రాల్లో ఉండటానికే ప్రాధాన్యతనిస్తానని వెల్లడి 
  • తాను ఇక్కడకు రావడంపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలన్న జయప్రద  

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని బీజేపీ నాయకురాలు, సినీ నటి జయప్రద తెలిపారు. తెలుగు బిడ్డగా ఏపీకి కానీ, తెలంగాణకు కానీ రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఇక్కడ ఉండి పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకోవాలనుకుంటున్నానని అన్నారు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో ఉండటం కంటే... తెలుగు రాష్ట్రాల్లో ఉండటానికే తాను ప్రాధాన్యతను ఇస్తానని చెప్పారు. ప్రస్తుతం తాను ఉత్తరప్రదేశ్ క్యాడర్ లో ఉన్నానని... తాను ఇక్కడకు రావాలంటే పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఒక ప్రైవేట్ స్కిన్ లేజర్ క్లినిక్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన మనసులోని ఆకాంక్షను వెల్లడించారు.

Jayaprada
BJP
Telugu States
Politics
  • Loading...

More Telugu News