Andhra Pradesh: ఏపీ గ‌వ‌ర్న‌ర్‌తో కాంగ్రెస్ నేత‌ల భేటీ... ప‌లు ఘ‌ట‌న‌ల‌పై ఫిర్యాదు

cngress leaders meets ap governor on sun day

  • విజ‌య‌వాడ‌లోని రాజ్ భ‌వ‌న్‌కు కాంగ్రెస్ నేత‌లు
  • రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిస్థితిపై ఆందోళ‌న‌
  • అంశాల వారీగా గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత‌లు

ఏపీలో ఇటీవ‌ల చోటుచేసుకున్న ప‌లు కీల‌క ఘ‌ట‌న‌ల‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత‌లు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రి చంద‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు ఆదివారం విజ‌య‌వాడ‌లోని రాజ్ భ‌వ‌న్‌కు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేత‌లు గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో నానాటికీ శాంతి భ‌ద్ర‌త‌లు స‌న్నగిల్లుతున్నాయ‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబు కారు డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం దారుణంగా హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్సీనే స్వ‌యంగా సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని చంపేసిన వైనాన్ని కాంగ్రెస్ నేత‌లు గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించారు. అదే స‌మ‌యంలో కోన‌సీమ జిల్లా కేంద్రం అమ‌లాపురంలో చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌పైనా వారు గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న అత్యాచారాల‌పైనా పోలీసులు పెద్ద‌గా స్పందించ‌డం లేద‌ని కాంగ్రెస్ నేత‌లు గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేశారు.

Andhra Pradesh
Congress
AP Governor
Biswabhusan Harichandan
  • Loading...

More Telugu News