NTR: ఎన్టీఆర్‌ను స్మరించుకున్న టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్

- 1988 మే 20న మియాపూర్‌లో బస్ బాడీ బిల్డింగ్‌కు ఎన్టీఆర్ పునాది
- ఈ కార్యక్రమానికి ఆర్టీసీ బస్సులోనే వెళ్లిన ఎన్టీఆర్
- ఈ వివరాలతో సజ్జనార్ ట్వీట్
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావును సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్సార్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ స్మరించుకున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని శనివారం ఆర్టీసీకి ఎన్టీఆర్ చేసిన సేవలను కీర్తిస్తూ సజ్జనార్ ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు.
