Perni Nani: గతంలో జగన్ పాదయాత్రకు ఎలా అయితే జనం వచ్చారో ఇప్పుడు బస్సు యాత్రకు కూడా అలాగే వస్తున్నారు: పేర్ని నాని

Perni Nani on YSRCP Bus Tour

  • వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరి యాత్ర
  • కృష్ణా జిల్లా చేరుకున్న బస్సు యాత్ర
  • గన్నవరం విచ్చేసిన మాజీ మంత్రి పేర్ని నాని

వైసీపీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కృష్ణా జిల్లా చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని గన్నవరం వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, తమ మంత్రులు చేపట్టిన బస్సు యాత్రకు విశేష స్పందన వస్తోందని వెల్లడించారు. గతంలో సీఎం కాకముందు జగన్ చేపట్టిన పాదయత్రకు జనం తండోపతండాలుగా వచ్చారని, ఇప్పుడు తమ బస్సు యాత్రకు కూడా అదే రీతిలో స్పందన వస్తోందని వివరించారు. 

సామాజిక న్యాయం గురించి చెప్పడమే కాదని, చేసి చూపిస్తున్న ప్రభుత్వం తమదని అన్నారు. బస్సు యాత్రలో వచ్చేది మంత్రులా, ద్వితీయశ్రేణి నాయకులా అనేది ప్రజలు చూడడంలేదని, జగన్ వస్తున్నట్టే భావిస్తున్నారని వివరించారు. 

ఇక, టీడీపీ మహానాడు నిర్వహిస్తుండడం పట్ల కూడా పేర్ని నాని స్పందించారు. మంత్రుల బస్సు యాత్ర మహానాడుకు పోటీగా నిర్వహిస్తున్నది కాదని పేర్కొన్నారు. అసలు, మహానాడు నిర్వహించే అర్హత చంద్రబాబు కుటుంబానికి లేదని పేర్ని నాని విమర్శించారు.

Perni Nani
Bus Tour
Samajika Nyaya Bheri
YSRCP
TDP Mahanadu
  • Loading...

More Telugu News