Ntr: ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తే 100 సినిమాల పాప్యులారిటీ వచ్చింది: నటి ప్రభ

Prabha Interview

  • ఈ రోజున ఎన్టీఆర్ శత జయంతి 
  • ఆయనను స్మరించుకున్న సీనియర్ నటి ప్రభ 
  • ఎన్టీఆర్ కారణ జన్ములు అంటూ వ్యాఖ్య
  • ఆయన సరసన నటించడం అదృష్టమంటూ వివరణ

తెలుగులో ఎన్టీఆర్ సరసన కథానాయికగా నటించిన వారిలో ప్రభ ఒకరు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ప్రభ మాట్లాడుతూ .. "నిజానికి ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడేంత వయసు .. అనుభవం నాకు లేవు. రామకృష్ణ సినీ స్టూడియోస్ లో మొదటిసారిగా ఆయన 'దాన వీర శూర కర్ణ' సినిమాను నిర్మించారు. ఆ స్టూడియో ఓపెనింగ్ హీరోయిన్ నేను అయినందుకు నాకెంతో గర్వంగా అనిపించింది.

100 సినిమాల్లో నటిస్తే ఎంత పాప్యులారిటీ వస్తుందో .. ఎన్టీఆర్ సరసన నాయికగా 'ఒక్క సినిమా చేసిన నాకు అంతే పాప్యులారిటీ వచ్చింది. 'దాన వీర శూర కర్ణ' సినిమాలోని 'చిత్రం.. భళారే విచిత్రం' సాంగ్ అప్పటికీ .. ఇప్పటికీ సూపర్ హిట్. ఆ సినిమాకి .. ఆ పాటకి ఎంతటి ఆదరణ లభించిందనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

రామారావుగారి గురించి ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం ఆయన కారణజన్ముడు. రాముడిగా .. కృష్ణుడిగా ఆయన ధరించిన పాత్రలను చూస్తూ పెరిగిన నేను, ఆయన పక్కన హీరోయిన్ గా చేస్తానని అస్సలు అనుకోలేదు. అలాంటి అవకాశం రావడం నిజంగా నా అదృష్టం" అంటూ చెప్పుకొచ్చారు.

Ntr
Prabha
Dana Veera Soora karna Movie
  • Loading...

More Telugu News