Pan India: పాన్ ఇండియా హీరోయిన్ గా ఊపేస్తున్న సమంత .. జూనియర్ ఎన్టీఆర్ ఏ స్థానంలో ఉన్నాడంటే..!

Samantha is most popular pan India female star

  • ఇండియాను దాటి పోతున్న సమంత క్రేజ్
  • పాన్ ఇండియా హీరోయిన్లలో రెండో స్థానంలో అలియా భట్
  • పాన్ ఇండియ హీరోల్లో రెండో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత అందాల భామ సమంత తన పూర్తి దృష్టిని బాలీవుడ్ పై కేంద్రీకరించింది. పలు ఆఫర్లతో ఆమె దూసుకుపోతోంది. ఉత్తరాదిన ఆమెకు నానాటికీ ఫాలోయింగ్ భారీగా పెరుగుతోంది. అంతేకాదు ఆమె క్రేజ్ ఇండియాను దాటిపోతోంది. ఇండియన్ ఫిమేల్ స్టార్స్ లో సమంత టాప్ పొజిషన్ లో నిలిచింది. ORMAX మీడియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. 

ఇండియన్ మోస్ట్ పాప్యులర్ హీరోయిన్స్ జాబితాలో సమంత తొలి స్థానంలో నిలవగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ రెండో స్థానానికి పరిమితమయింది. తర్వాతి స్థానాల్లో నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పదుకుణే, రష్మిక మందన్న, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, కీర్తి సురేశ్, పూజా హెగ్డే ఉన్నారని ORMAX వెల్లడించింది. 

ఇక హీరోల విషయానికి వస్తే తమిళ స్టార్ విజయ్ తొలి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ నిలిచారు. ఏదేమైనప్పటికీ పాన్ ఇండియా లెవెల్లో ఉత్తరాది స్టార్ల కంటే దక్షిణాది వారే ఎక్కువగా ఉండటం గమనార్హం.

Pan India
Heroine
Samantha
Junior NTR
Tollywood
Bollywood
ORMAX Media Survey
  • Loading...

More Telugu News